హైదరాబాద్: ఆందోళన వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని ముఖ్యమంత్రి కె. రోశయ్య అసత్య ప్రచారానికి దిగుతున్నారని, రోశయ్య స్థాయికి అది తగదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల వల్ల గత నెల రోజులుగా పారిశ్రామిక సంస్థలు తరలిపోతున్నాయని రోశయ్య చెబుతున్న మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి ఎన్నో కంపెనీలు తరలిపోయాయని ఆయన అన్నారు. వోక్స్ వ్యాగన్, నానో కార్ల కర్మాగారం వంటివి ఏ ఉద్యమాల కారణంగా రాష్ట్రానికి రాలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదుపై ఆంధ్ర పాలకులు అసత్య ప్రచారానికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. కూకట్ పల్లిలోని జెఎన్టీయులో జరిగిన తెలంగాణ ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి