చిరంజీవి, జెసి దివాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారు: పొన్నం ప్రభాకర్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: హైదరాబాదులో సమైక్యాంధ్ర సభను పెడతామని చెప్పి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి, తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో ఇక్కడ సభ పెడతామని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అయితే ఆ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవచ్చునని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వారి ఉద్యమాల సభలను వారి ప్రాంతాల్లో పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని, తమ ప్రాంతంలో పెడతామనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ సభను తాము విజయవాడలో పెడతామని అనడం లేదు కదా అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం వల్ల పరిశ్రమలు వెనక్కి పోతాయడనం సరి కాదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి