వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై ఒక్క మాటలో చెప్పు: జయప్రకాష్ నారాయణ

దీంతో స్పందించిన జేపీ తన వైఖరేంటో ఇప్పటికే ప్రకటించానని, కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఆయన జేఏసీ నాయకులకు సూచించారు. అయినా వారు పట్టువీడకుండా అవును, కాదు రెండు మాటల్లో తేల్చాలని భీష్మీంచారు. సమావేశానంతరం బయటకొచ్చిన జేపీ కారును అడ్డుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. అయితే జేపీ ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా జేఏసీ నాయకులు కారు ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకుని కారును ముందుకుపోనిచ్చారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.