హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బుధవారం ఉదయం కలుసుకున్నారు. ఆయన గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు చెబుతున్నారు. సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని పదవి నుంచి తప్పుకున్న ఎన్డీ తివారీ స్థానంలో నరసింహన్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయనను వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలుస్తూనే ఉన్నారు.
మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కలుసుకన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై, విద్యార్థులపై పెట్టిన కేసులపై కెసిఆర్ గవర్నర్ కు వివరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి