వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంపై భగ్గుమన్న లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటనపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ భగ్గుమన్నారు. కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో ఏముందో చిదంబరం చెప్పగలరా అని ఆయన అడిగారు. వేర్పాటువాదం ఇంతటితో ఆగదని, దాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఆయన అన్నారు. రెచ్చగొడుతున్నది, చిచ్చుపెడుతున్నది తెలంగాణవారేనని ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రాల సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీసేలా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలతో రాజకీయ పార్టీలు చదరంగం ఆడుకుంటున్నాయని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణం లేకుండా ఎలా చర్చలు జరుపుతారని ఆయన చిదంబరాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్రంపై మచ్చ పడిందని ఆయన విమర్శించారు. తెలుగు రాష్ట్రం ఐక్యతను కాపాడుదామని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం వల్ల తెంలగాణకు, హైదరాబాదుకు వెళ్లవద్దని అమెరికా, యుకె హెచ్చరిస్తున్నాయని, దీన్ని బట్టి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రజల మధ్య సామరస్యానికి రాజకీయ పార్టీలు కృషి చేయాలని ఆయన సూచించారు.

తెలుగు మాట్లాడడం రాని పార్టీలది కూడా సమైక్యవాదమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో చర్చలు జరగకుండా తెలంగాణపై కేంద్రం చర్చలు జరపడం సరి కాదని ఆయన అన్నారు. ప్రతిదానికీ కేంద్రం జోక్యం చేసుకుంటే రాష్టం ఎందుకని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి వేసిన కమిటీని పునర్వ్యస్థీకరించాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు స్వార్థంతో వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని జమ్మూ కాశ్మీర్ లా చూసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఐటి పరిశ్రమ బెంగుళూర్ కు, సినీ పరిశ్రమ చెన్నైకి తరలిపోవడానికి సిద్ధపడుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనలో అనేక సమస్యలున్నాయని, ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర స్థాయి కమిటీ అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రం హక్కులను కాపాడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన పార్టీలు మొన్నటి ఎన్నికల్లో మట్టి కరిచాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య గాంధేయవాది అని, అటువంటి రోశయ్యపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తన సమైక్యవాద ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. విభజన రాజకీయాలతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఓడిన పార్టీలు ప్రజారాజ్యం లాగే తమ వైఖరి మార్చుకుంటాయని ఆయన అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయ నాయకుల స్వార్థంతో విద్యార్థులు, యువకులు నష్టపోతున్నారని ఆయన అన్నారు.

సమైక్యాంధ్ర కోసం, సమైక్య తెలంగాణ కోసం తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కలిసి ఉండడం వల్ల తెలంగాణ నష్టపోయిందని చెప్పమనండని ఆయన అడిగారు. 1956కు ముందు ఆంధ్ర అభివృద్ధి చెందిందని, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి నిధులు ఎక్కవ కేటాయించాలని, తెలంగాణ మెట్ట ప్రాంతం కాబట్టి నిధులు ఎక్కవ పెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోకూడదని, కావాలంటే రాష్ట్రం పేరును తెలంగాణగా మార్చుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణకు తక్కువ, ఆంధ్రకు ఎక్కువ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X