కోమటిరెడ్డి ఆరోపణపై రోశయ్య ఆవేదన

ముఖ్యమంత్రిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు రఘువీరారెడ్డి, గాదె వెంకట రెడ్డి, వట్టి వసంత కుమార్ తప్పు పట్టారు. ముఖ్యమంత్రికి పక్షపాత వైఖరి అంటగట్టడం సరైంది కాదని వారన్నారు. తన అభిప్రాయాలను చెప్పదలుచుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే వేదికలున్నాయని, బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరి కాదని వారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ విషయాన్ని తమ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ దృష్టికి తీసుకుని వెళ్తానని రోశయ్య చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications