తెలంగాణపై వెనకడుగు లేదు: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వెనకడుగు లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగానే జనవరి 5వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు, చర్చలకు ఒక రూపం ఇవ్వడానికి ఆ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తాను డిసెంబర్ 9వ తేదీ ప్రకటనకు, 23వ తేదీన చేసిన ప్రకటనకు మధ్య ఏ విధమైన వ్యత్యాసం లేదని, తెలంగాణ విషయంలో కేంద్రం మాట మార్చిందని మీడియా ప్రచారం చేసిందని, నిజానికి కేంద్రం మాట మార్చలేదని, పరిస్థితులు మారినందున 23వ తేదీ ప్రకటన చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రెండుగా చీలిపోయినందున రెండోసారి ప్రకటన చేయాల్సి వచ్చిందని, మరోసారి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో రోశయ్య హాజరవుతారని ఆయన చెప్పారు.

డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో సిపిఎం మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రవేశపెడితే బలపరుస్తామని చెప్పాయని, మజ్లీస్ మాత్రం చర్చ సందర్భంగా తమ అభిప్రాయం చెబుతానని తెలిపిందని, ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో తాను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తామని, శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారని చెప్పామని ఆయన వివరించారు. ఆ ప్రకటనలోని కీలకమైన పదాలను ఆయన చదివి వినిపించారు. అయితే తాను 9వ తేదీ ప్రకటన చేసిన తర్వాత రాజకీయ పార్టీలు మాట మార్చాయని, దాంతో 23వ తేదీన మరో ప్రకటన చేయాల్సి వచ్చిందని, దాంట్లో విస్తృత ప్రాతిపదికపై చర్చలు జరుపుతామని చెప్పామని, అది మాట మార్చడం కాదని, తెలంగాణకు కట్టుబడి ఉన్నాం కాబట్టే జనవరి 5వ తేదీన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

తమ యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పామని ఆయన గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయాలు పార్టీలు ఏదో రూపంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలత వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రణాళికలో చేర్చాయని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+