హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యపై తాను వ్యక్తిగతమైన ఆరోపణలు చేయలేదని రాష్ట్ర ఐటి, క్రీడల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను మాత్రమే తాను వ్యక్తీకరించానని, రోశయ్యపై తాను వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను ఇప్పటికీ తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తనకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు అందిందని, దానికి రేపటి లోగా సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో కొంత మంది రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, తాము తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడితే తమపై చర్యలకు పూనుకుంటున్నారని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి