వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూగో జిల్లాలో సంపూర్ణ బంద్ కు రంగంలో అన్ని పార్టీలు

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari Bandh
రాజమండ్రి: పదకొండు రోజుల విరామం తర్వాత సమైక్య ఆంధ్ర కోసం ఆందోళన కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం రెండో ప్రకటనతో సంతృప్తి చెందిన సమైక్య ఆందోళనకారులు ఉద్యమాలకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. కానీ అఖిలపక్షం నేతలను ఢిల్లీకి పిలిచి అభిప్రాయ సేకరణ చేయాలన్న నిర్ణయం తెలంగాణకు అనుకూలమవుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ చర్చలకు ముందుగానే సీమాంధ్ర బంద్‌కు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపునిచ్చింది. దాని మేరకు జిల్లాలో సోమవారం సంపూర్ణంగా బంద్‌ నిర్వహిం చేందుకు వివిధ పార్టీల నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాలుగు రోజులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ జిల్లాలో బంద్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా బంద్‌కు మద్దతు పలికినందున జిల్లాలో పీఆర్పీ నాయకులు ఆందోళనకు సహకరించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా రాజమండ్రి, అమలాపురం తదితర చోట్ల ఆదివారం జరిగిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశాలకు హాజరై బంద్‌కు మద్దతును ప్రకటించారు.

కాకినాడలో ఆదివారం టీడీపీ జిల్లా అడ్‌హక్‌ కమిటీ సమావేశమై సోమవారం నాటి బంద్‌ను మంగళవారం నాటి రైల్‌రోకో ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతుగా నిలవనుంది. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో మూడోసారి బంద్‌ జరగనుండటం గమనించాల్సిన విషయం. బంద్‌ పిలుపు దృష్ట్యా ఆర్టీసీ బస్సు సర్సీసుల్ని నిలిపి వేయనుంది. జిల్లాలో ఆదివారం రాత్రి నుంచే బస్సుల్ని నిలిపివేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X