హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో జరగాల్సిందంతా జరిగిపోయిందని రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. రేపటి చర్చల నేపథ్యంలో ఆయన సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము ఢిల్లీ వెళ్లి చేసేదేమి ప్రత్యేకంగా ఏమీ లేదని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి తామేదో పొడిచేస్తామనేది ఏమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై నిర్ణయం అయిపోయిందా అని అడిగితే ఎవరన్నారు, తాము చెప్పాల్సిందంతా చెప్పామని ఆయన జవాబిచ్చారు. తెలంగాణ జెఎసి విద్యార్థులు ఆంధ్రవాళ్ల విషయంలో మాట్లాడిన తీరు బాగా లేదని ఆయన అన్నారు.
తాను ఢిల్లీలో సమైక్యవాదం వినిపిస్తానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరే వెళ్లే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంక్రాంతి పండుగకు వెళ్లిన వారిని తిరిగి హైదరాబాద్ రానివ్వబోమని తెలంగాణ విద్యార్థులు అనడం సరి కాదని ఆమె అన్నారు. భారతీయులంతా ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు ఉందని ఆమె అన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని ఆమె అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి