హస్తినలో బిజీ బిజీగా సిఎం రోశయ్య

Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.రోశయ్య సోమవారం ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం తెలంగాణపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశం నేపథ్యంలో ఆయన కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులతో భేటీ అవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. రోశయ్య సోమవారం ఉదయం కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. తాను వీరప్ప మొయిలీతో రాష్ట్ర రాజకీయాలపై మాత్రమే మాట్లాడినట్లు డి.శ్రీనివాస్ భేటీ అనంతరం తెలిపారు. కోర్ కమిటీ సమావేశానికి డి.శ్రీనివాస్ ను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది.

కాగా, రోశయ్య కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో కూడా సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో కూడా ఆయన సమావేశమవుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో కూడా రోశయ్య పాల్గోనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై అనుసరించాల్సి వైఖరిపై కోర్ కమిటీ చర్చించనుంది. రోశయ్య కన్నా ముందుగానే డి. శ్రీనివాస్ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెసు నాయకులు ప్రాంతాలవారీగా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. లగడపాటి రాజగోపాల్, జెసి దివాకర్ రెడ్డి పనబాక లక్ష్మి వంటి సమైక్యవాదులు, టి జీవన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+