కడప: కేసు నుంచి బయటపడిన తర్వాత తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటానని తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసు నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి చెప్పారు. ఆయన సోమవారం కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. బెయిల్ పై విడుదలైన సూరి ప్రస్తుతం ఫాక్షనిజానికి దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండదలుచుకున్నట్లు తెలిపారు. ఆయన ఒక ప్రైవేటే టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు.
ప్రస్తుతం రాజకీయాలపై ఆలోచన లేదని, ప్రశాంతంగా ఉండదలుచుకున్నానని ఆయన చెప్పారు. కేసు నుంచి బయట పడిన తర్వాత తప్పకుండా తాను రాజకీయాల్లో ఉంటానని, తమ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లో ఉందని ఆయన అన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి