వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీమాంధ్ర బంద్ లో చెలరేగిన హింస

కాగా, చిత్తూరులో పెట్రోల్ బంక్ పై సమైక్యాంధ్ర ఆందోళనకారులు దాడులు చేశారు. విజయవాడలో కూడా అరెస్టులు జరిగాయి. బంద్ సందర్భంగా పోలీసులు 200 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో 500 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకుడు దేవినేని అవినాష్ ను పోలీసులు అరెస్టు చేసి పమిడిముక్కల పోలీసు స్టేషన్ కు తరలించారు. అవినాష్ అరెస్టును అడ్డుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే ఫలితం లేకపోయింది. అవినాష్ అరెస్టును సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు మండలి బుద్దప్రసాద్, దేవినేని నెహ్రూ, దేవినేని ఉమా మహేశ్వరరావు, కృష్ణారావు ఖండించారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద వారు ధర్నాకు దిగారు. పలు జిల్లాల్లో ఆందోళనకారులు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు.