వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణకు కేంద్రం అనుకూలం: సిపిఐ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ శంకించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం గానీ, కాంగ్రెసు పార్టీ గానీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలో పరిస్థితి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలయాపన మంత్రాన్నే కేంద్రం ఆచరిస్తోందని ఆయన విమర్శించారు.