అమలాపురం: అమలాపురం మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి, అతడి కుమారుడితోపాటు మరో వ్యక్తిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం హత్య కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్సై బి.హెచ్.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం, గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమలాపురానికి చెందిన కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, నల్లా విష్ణుమూర్తిల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్ 24వ తేదీ అర్ధరాత్రి సత్యనారాయణమూర్తి మోటార్‌సైకిల్‌పై బోడుసుకుర్రు వైపు నుంచి వస్తున్నాడు. అతడిన మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి, అతని కుమారుడు నల్లా పవన్‌కుమార్, అరిగెల నాని కొంకాపల్లి ఏవీఆర్ నగర్ వద్ద కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు.
తీవ్రంగా గాయపడిన మూర్తిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని ఆస్పత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ మూర్తి మృతి చెం దాడు. కాకినాడ త్రీటౌన్ పోలీసులకు మూర్తి వాంగ్మూలం ఇచ్చినట్టు ఎస్సై తెలిపారు. మృ తుడి అన్న శ్రీనివాసరావు అమలాపురం కో ర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ముగ్గురిపై హత్య కేసు నమో దు చేసినట్టు ఎస్సై చెప్పారు. గతంలో కారు డ్రైవర్ అరిగెల పుల్లయ్యనాయుడుపై యాక్సిడెంట్ కేసు నమోదు చేశామని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి