'పెద్ది' కి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. ఇదేందయ్యా ఇదీ..!
మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ తెలుగు ప్రేక్షుకుడు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'పెద్ది'.. ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా సమ్మర్ లో మాత్రం ఒక్క పెద్ద సినిమా కూడా రాకపోవడంతో సినీ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ సమయంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదల కానుంది. దాంతో అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పెద్ది ట్రైలర్ కేవలం యూట్యూబ్ లోనే కాకుండా ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి.
అయితే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 4 న విడుదలకు సిద్ధమైన పెద్ది మూవీకి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ చిత్రం సెన్సార్ బోర్డు పరిశీలన పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న సెన్సార్ సర్టిఫికెట్ వివరాల ప్రకారం ఈ సినిమాకు బోర్డు పలు సంచలన మార్పులను, కత్తెర్లను సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సాంగ్ గా పేరుగాంచిన చికిరి పాటలో కొన్ని లిరిక్స్ ను కట్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ లో వచ్చే 'సరుకు సామాన్' అనే పదాన్ని మార్చాల్సిందిగా బోర్డు సూచించడంతో మేకర్స్ ఆ పదంలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పాత్రల తీవ్రతను చూపించడం కోసం వాడిన కొన్ని కఠినమైన, బూతు పదాలపైనా బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇక మరికొద్దిసేపట్లో మధ్యప్రదేశ్ భోపాలో గ్రాండ్ పెద్ది మ్యూజికల్ కన్సెర్ట్ ప్రారంభం కాబోతుంది. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, అలాగే లెజెండరీ టీమ్ ఇండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ లాంటి ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ వేడుకలోనే పెద్ది సినిమాలోని మాస్ బీట్ సాంగ్ ను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. పెద్ది మూవీ జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications