రాత్రికి రాత్రే తెలంగాణ సాధ్యం కాదు: ప్రణబ్ ముఖర్జీ
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రాత్రికి రాత్రే సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితి చెప్పలేమని ఆయన మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం అవసరం లేకపోయినప్పటికీ అభిప్రాయం అవసరమని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అంత సులభం కాదని, అందుకే సుదీర్ఘ సమయం పడుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాహార దీక్ష నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర భయాందోళనలకు గురైందా అని అడిగితే లేదని చెప్పారు. తాము పట్టించుకోకపోతే ప్రభుత్వ స్పందించకుండా ఎలా ఉంటుందని మీడియానే ప్రశ్నించిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదని, ఏకాభిప్రాయం కుదిరితే మంచిదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి