హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోం మంత్రి ఉన్నారా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గురువారం రాత్రి జరిగిన విధ్వంసంపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్సించారు. కొన్ని చానెళ్లు విలువలను విస్మరించాయని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని మార్చే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. గురువారంనాటి సంఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ మరణంపై మీడియా వచ్చిన వార్తలు అవాస్తవంగా ఉన్నాయని ఆయన అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
రాత్రికి రాత్రి ప్రచారం చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ఆయన విమర్శించారు. నిన్నటి వ్యవహారమంతా పథకం ప్రకారం జరిగిందని, అదంతా కుట్రేనని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆయన విమర్శించారు. రాష్టంలో ఎవరికీ భద్రత లేకుండా పోయిందని ఆయన అన్నారు. అవాస్తవాలను మీడియాలో ప్రసారం చేసి విధ్వంసం సృష్టించారని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి