హైదరాబాద్ : పెంచిన బస్‌ఛార్జీలను మరింత తగ్గించాలని ముఖ్యమంత్రి రోశయ్యను కోరినట్లు పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఛార్జీల పెంపుకు సంబంధించి సామాన్యుడిపై భారం పడకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం చేస్తామన్నారు. అనధికారిక వెబ్‌సైట్ ఆధారంగా ఛానళ్లు కథనాలు ప్రసారం చేయటం సరికాదన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు.
చిరంజీవి మళ్ళీ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళనున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆయన ఉన్నందువల్ల ఆంధ్రలో ఆయనకు జనం నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి