విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతికి సంబంధించి మరోసారి సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కోరారు. రిలయన్స్‌పై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఆ కోణంలో సీబీఐ దర్యాప్తును పూర్తిస్థాయిలోచేపట్టాలన్నారు. ఈ విషయమై నిజానిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , ప్రజలు కూడా ఆందోళనలకు గురవుతున్నారన్నారు.
వైయస్ మృతికి సంబంధించి రిలయన్స్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తుజరపాలని పీసీసీ కార్యదర్శి కొయ్య ప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విధమైన చర్యలకు రిలయన్స్ పాల్పడి ఉంటే ఏ ఒక్కరూ క్షమించరని ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన అభివర్ణించారు. అందుకే తక్షణం ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు కార్యకర్తలు నాయకుల్లో వున్న అపోహలను కూడా నివృత్తి చేయాలని కోరారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి