కాకినాడలో హోప్ ఐలాండ్ కు 50 కోట్ల రిలయెన్స్ నిధులు
Districts
oi-Santaram
By Santaram
|
కాకినాడ : కాకినాడకు సమీపంలోని హోప్‌ఐలాం డ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్టు కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఇందు కు అటవీ, పర్యాటక అనుమతుల కోసం సత్వర ప్రతిపాదనలు పంపాలని అధికారులను కోరారు. ప్రాజెక్టు అమలులో రిలయన్స్ సంస్థ రూ. 50 కోట్ల మేర భాగస్వామ్యం వహించేందుకు సూత్రప్రాయంగా అంగీకా రం తెలిపిందన్నారు. అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టు అమలుకు సత్వర అనుమతులు, నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చమురు, సహజ వాయువుల్ని ఉత్పత్తి చేస్తున్న కార్పొరేట్ సంస్థలు సామాజిక అభివృద్ధికి ముందుకు రావాలని ఎంపీ హర్షకుమార్ కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో చమురు, సహజవాయువు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. రిలయన్స్, గెయిల్, ఓఎన్జీసీ, కెయిర్న్, జీఎస్‌పీసీ సంస్థలు ఆయా ప్రాంతాల అభివృద్ధికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నా, ప్రజల అవసరాలను, ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి