వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు సిబ్బందికి దడ పుట్టిస్తున్న బెజవాడ కమిషనర్

By Santaram
|
Google Oneindia TeluguNews

MM Bhhagawath
విజయవాడ: నిక్కచ్చిగా, వినూత్నంగా వ్యవహరిస్తున్న ఇంచార్జ్ పోలీసు కమిషనర్ పోలీసు సిబ్బందికి, అసాంఘిక శక్తులకు దడ పుట్టిస్తున్నారు. ఆయన చార్జి తీసుకున్న 20 రోజుల్లో ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. చార్జి తీసుకున్న వెంటనే కృష్ణలంక ఎస్‌ ఐ కృష్ణకుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత పటమట సీఐ మధుసూదన్‌రెడ్డితో ఘర్షణ పడిన కానిస్టేబుల్‌ అర్జునరావును, మహిళ విషయంలో అసభ్య కరంగా ప్రవర్తించిన గన్నవరం ఏఎస్‌ఐ నరసింహారావును సస్పెండ్‌ చేశారు. అంతేగాకుండా సదరు ఏఎస్‌ఐని కటకటాల వెనక్కి కూడా పంపించారు. ఇంకేముంది సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.

నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు చేయటం, కోడి పందాల శిబిరాలపై మెరుపుదాడి చేయించడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలను సీపీ ఆదేశాల మేరకు పోలీ సులు అరెస్టు చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో కోడి పందాలు వేస్తున్న వారిని అరెస్టు చేసి, 42 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో జరుగుతున్న చోరీలను అరికట్టడంపై కూడా దృష్టి సారించారు. క్రైం సమావేశం నిర్వహించి అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు. చోరీలకు సంబంధించిన సొత్తు రికవరీ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. రికవరీల బాధ్యతలను ఏసీపీలకు అప్పగించారు. దీంతో కమిషనరేట్‌లోని ముగ్గురు ఏసీపీలు తమ స్టేషన్ల పరిధిలో జరిగిన నేరాలు, రికవరీ, పెండింగ్‌ ఫైల్స్‌ తదితర వాటిపై సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సీసీఎస్‌ సీఐ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పోస్టును కూడా భర్తీ చేశారు.

అధికారులుగానీ, సిబ్బందిగానీ ఎవరైనా విధి నిర్వహణలో అలసత్వం వహించినా కూడా సహించే స్థితిలో లేరు. ఇదిలావుండగా, పోలీస్‌ కమిషనర్‌ గా భగవత్‌నే కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో సిబ్బంది మరింత హడలెత్తుతున్నారు. ఈయన వద్ద పని చేయడం చాలా కష్టమంటూ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ప్రజల సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక సెల్‌ నంబర్‌ను ఇచ్చారు. ఎవరైనా ఎస్‌ఐలు, సీఐలు, కానిస్టే బుళ్లు సరిగా పని చేయక పోయి నా, ఫిర్యాదు దారు ల విషయంలో గౌరవంగా వ్యవ హరించక పోయి నా వెంటనే సీపీ సెల్‌కు సమాచా రం వస్తుంది. దీంతో ఆ విషయంలో కూడా అధికారులు భయపడు తున్నా రు. ఏది ఏమైనా ఇన్‌చార్జి సీపీ భగవత్‌ చర్యలతో కమిషనరేట్‌ లోని అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా పని చేస్తుండటం విశేషం. ఇదే పరిస్థితి ఇకపై కూడా కొన సాగాలని పలువురు కోరు తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X