వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావూరి సాంబశివరావుపై తెలంగాణ నేతల గుస్సా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambhasiva Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన ప్రకటనపై తెలంగాణ నేతలు పార్టీలకు అతీతంగా తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ వచ్చి ఉండేది కాదని ఆయన అనడంపై తెలంగాణ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కావూరి మాటలు తమను అవమానించేవిగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కావూరి మాటలు ఆంధ్ర ఆధిపత్య ధోరణికి నిదర్శనమని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి విమర్శించింది. పదవుల పేరు చెప్పి ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కావూరి వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనాలని కోరుతుంటే కావూరి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. పదవులతో తెలంగాణ ఉద్యమం ఆగేది కాదని ఆయన అన్నారు.

కావూరి మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్ర మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా కావూరి మాట్లాడారని ఆయన విమర్శించారు. కావూరి మాటలను పెద్ద జోక్ గా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అభివర్ణించారు. కావూరివంటి పెట్టుబడి దారులైన నాయకులు పదవుల గురించి ఆలోచిస్తారని తాము కాదని ఆయన అన్నారు. తెలంగాణ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తెలంగాణ ఉద్యమం ఆగదని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. పదవులతో తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమ అని ఆయన అన్నారు.

తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో కావూరి సాంబశివ రావు ఏలూరులో వివరణ ఇచ్చారు. పదవులు ఇవ్వడానికి తానెవరినని ఆయన అన్నారు. తెలంగాణ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆ నాయకుడు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఉండేవారని అన్నట్లు ఆయన తెలిపారు. 1956 ఒప్పందం మేరకు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని తాను అన్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X