ఇంటి దొంగల పట్ల జాగ్రత్త: యాష్కీ

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు డ్రామాలు చేసిందెవరో తమకు తెలుసునని ఆయన అన్నారు. ఉస్మానియా విద్యార్థులపై పోలీసులు దౌర్జనం చేసినప్పుడు శాంతి యాత్రలు చేయాలని గుర్తు రాలేదా అని ఆయన అడిగారు. ఇప్పుడేమైందని శాంతి యాత్రలు నిర్వహిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేక కుట్రలో భాగంగానే శాంతి ర్యాలీలు నిర్వహిస్తామని అంటున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే తెలంగాణలో నక్సల్స్ ప్రాబల్యం పెరుగుతుందని వ్యాఖ్యానించిన డిజిపి గిరీష్ కుమార్ పై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వ్యక్తిగత అభిప్రాయాలున్న వ్యక్తి, సంకుచిత అభిప్రాయాలున్న వ్యక్తి డిజిపిగా ఉండడానికి అనర్హుడని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతోందని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులు కూడా జెఎసిలో భాగస్వాములై దాని నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications