వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుర్గగుడిలో "రాసలీల" నివేదికపై కమిషనర్ ఆగ్రహం

By Santaram
|
Google Oneindia TeluguNews

Durga Temple
విజయవాడ: దేవాదాయశాఖ కమిషనర్‌ సుందరకుమార్‌ ఆదివారం దుర్గగుడి అధికారులతో సమావేశమయ్యారు. ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై సమీక్షించిన కమిషనర్‌ దేవస్థాన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. రాసలీలల వ్యవహారంలో విచారణ నివేదికలోని అంశాలు ముందుగానే ఎందుకు లీకయ్యాయంటూ దుర్గగుడి ఈవో విజయకుమార్‌, సహాయ కమిషనర్‌ శారదాకుమారిని కమిషనర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. దుర్గగుడి ఉద్యోగుల రాసలీలల వ్యవహారం రెండు నెలల క్రితం స్పెసిఫైడ్‌ కమిటీ సమావేశం రోజున బహి ర్గతమైన సంగతి తెలిసిందే. ఒక ఉద్యోగి, ఉద్యోగిని విధి నిర్వహణలో ఉండగానే రాసలీలకు దిగడం సిసి కెమెరాలకు చిక్కినట్టు వార్తలు వచ్చాయి.

ఈ విషయమై వాస్తవాలు తేల్చేందుకు డెప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబను విచారణాధికారిగా అప్పటి ఈవో గోపాలకృష్ణారెడ్డి నియమించారు. ఆమె విచారణ చేసి ఆ నివేదికను ప్రస్తుత ఈవో విజయకుమార్‌కు అందచేశారు. అదే విధంగా సహాయకమిషనర్‌ శారదాకుమారి కూడా మరో విచారణ నివేదికను ఈవోకు అందచేశారు. ఈ రెండు నివేదికలను క్రోడీకరించి కమిషనర్‌కు నివేదిక పంపాల్సి ఉంది. ఈ విధంగా చేయకుండా డెప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన విచారణ నివేదిక ముందుగానే మీడియాకు ఏ విధంగా లీకయిందంటూ కమిషనర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X