మేడారం జాతరకు ముందే జనం పరవళ్ళు

ప్రధాన జాతర సమ యంలో రద్దీతో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఒక్క రోజే సుమారు లక్షలమంది గద్దెల ను దర్శించుకున్నట్లు అంచనా. జంపన్నవాగులోని స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు చేసిన భక్తులు నేరుగా గద్దెల వద్దకు చేరుకున్నారు. అమ్మవార్లకు ఇష్ట నైవేద్యమైన బంగారం(బెల్లం), కొబ్బరికాయల ను భారీగా సమర్పించుకున్నారు.
మేడారానికి తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లకయ్య, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించిన అనంతరం వివిధ అధికారులతో అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు 80లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకు అనుగుణంగా రూ. 22 కోట్లతో 4 నెలల నుంచి జాతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.