హైదరాబాద్: హైదరాబాద్ టాస్కుఫోర్సు పోలీసులు హర్కతుల్ జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) దక్షిణ భారత కమాండర్ ను అరెస్టు చేశారు. చెన్నైలో అరెస్టు అతన్ని హైదరాబాదు తీసుకొచ్చారు. అతన్ని సోమవారం మీడియా ప్రతినిధుల ముందు ప్రవేశపెట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26వ తేదీన విధ్వంసాలకు అతను కుట్ర చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాదులోని టాస్క్ ఫోర్సు కార్యాలయంపై దాడిలో అతని ప్రమేయం ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ప్రసాదరావు సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. టాస్కుఫోర్స్ కార్యాలయంపై దాడి తర్వాత 2004లో ఖాజా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఆయన తెలిపారు.
మక్కా మసీదులో బాంబు పేలుడు కేసులో నిందితుడు షాహెద్ బిలాల్ కు ఖాజా అనుచరుడని ఆయన చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా మిలిటెంట్లు సమాచారం మార్చుకుంటారని ఆయన చెప్పారు. ఖాజా నుంచి అమెరికా డాలర్లు, సౌదీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఖాజా బంగ్లాదేశ్ లో ఉంటూ భారత్ లో దాడులకు కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు రాష్ట్ర టాస్కుపోర్స్ పోలీసులు చెన్నై వెళ్లి ఖాజాను అదుపులోకి తీసుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి