న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ నుంచి తనకు విముక్తి లభించిందని పార్టీ పదవులకు రాజీనామా చేసిన అమర్ సింగ్ అన్నారు. తాను పార్టీ పదవులకు చేసిన రాజీనామాలను ములాయం సింగ్ ఆమోదించిన తర్వాత సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన రాజీనామాలను ఆమోదించినందుకు ములాయం కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, తన సమయాన్ని సృజనాత్మక పనులకు వెచ్చిస్తానని ఆయన అన్నారు. ములాయం వాదీని కాకుండా తాను సమాజ్ వాదీని అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. తాను సమాజ్ వాదీ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు.
ములాయం వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకే తాను పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. స్వేచ్ఛగా మాట్లాడడానికి తనకు అవకాశం లభించిందని, తనకు ములాయం కుటుంబం నిర్వహణాలోపం నుంచి విముక్తి లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ పార్టీలోనే ఉంటారని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి