హైదరాబాద్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్ల దాడుల్లో సోమవారం కనీసం ఐదుగురు మరణించారు. 38 మంది దాకా గాయపడ్డారు. కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని, ఇతర ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా ఎంచుకుని ఆత్మాహుతి దళ సభ్యులతో పాటు 20 మది సాయుధ మిలిటెంట్లు ప్రవేశించారని తాలిబాన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ చెప్పాడు. గంటల పాటు కాబూల్ లో ఎదురు కాల్పులు జరిగాయి. మొత్తంగా పరిస్థితి అదుపులో ఉందని, చెదురు మొదురు ఘర్షణలు మాత్రం జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఘర్షణల్లో ఒక పౌరుడితో పాటు నలుగురు సైనికులు మరణించినట్లు ప్రజారాగ్యో శాఖ తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను అంతం చేయడానికి దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో మిలిటెంట్లు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు. వీధుల్లో శిథిలాలు పేరుకుపోయాయి. రద్దీగా ఉండే ప్రదేశాలు ఖాళీ అయ్యాయి. అధ్యక్షుడిగా హమీద్ కర్జాయ్ ప్రమాణ స్వీకారం యథావిధిగా జరిగిందని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి