వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కడప నియోజకవర్గంలో జగన్ సమీక్షలు

కడప పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి పులివెందులకు చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన తన పెద నాన్న వై.ఎస్.ప్రకాష్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. అక్కడనుంచి తన స్వగృహానికి చేరుకున్నారు. ఎంపీ వై.ఎస్.జగన్ రాత్రివేళ తనకోసం వేచి ఉన్న జనం సమస్యలను ఓపిగ్గా తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తన అనుచరులను, కాంగ్రెస్ యువ నాయకుడు వై.ఎస్.అవినాష్‌రెడ్డికి చెప్పారు.