తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది: డిఎస్

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి జులై 25వ తేదీ వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) నిర్ణయించింది. శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ లో పోలింగ్ బూత్ స్థాయి ఎన్నికలు, మే 15 నుంచి 31 వరకు బ్లాక్ కాంగ్రెసు కమిటీ ఎన్నికలు, జూన్ 7 నుంచి 27 వరకు జిల్లా, నగర కాంగ్రెసు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తారు. జులై 5 నుంచి 25 వరకు పిసిసి కార్యవర్గం, ఎఐసిసి సభ్యుల ఎన్నిక, ప్లీనరీ సమావేశంలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలుంటాయి.












Click it and Unblock the Notifications