Commonwealth Games 2026:నేడే కామన్‌వెల్త్ గేమ్స్....లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్..!

మరికొన్ని గంటల్లో మరో క్రీడాసంరంభం ఆవిష్కృతం కానుంది.స్కాట్లాండ్ దేశంలోని గ్లాస్గో వేదికగా 2026 కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. జూలై 23వ తేదీ నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు జరిగే ఈ క్రీడాపోటీల్లో ప్రపంచ నలుమూలల నుంచి వేలమంది అథ్లెట్లు వారి వారి విభాగాల్లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 11 రోజుల పాటు కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి.

గ్లాస్గో గ్లాస్గో ఇంటర్నేషనల్ ఎరీనా, స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్, స్కాట్స్‌టౌన్ స్టేడియం,టోల్ క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్‌లు వేదికగా ఈ క్రీడాపోటీలు జరగుతాయి.ఇక ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆయా దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్‌లు ఉంటాయి. దీంతో కామన్‌వెల్త్ గేమ్స్ 2026 అధికారికంగా ప్రారంభం అవుతాయి.

commonwealth-games-2026-begins-today-opening-ceremony-time-live-streaming-in-india

ఓపెనింగ్ సెరెమొనీకి వేదిక

కామన్‌వెల్త్ గేమ్స్ 2026 ఓపెనింగ్ సెరెమొనీ గ్లాస్గోలోని ఓవీఓ హైడ్రో వేదికగా జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం జూలై 23వ తేదీ రాత్రి 10:30 గంటలకు ఓపెనింగ్ సెరిమొనీ ప్రారంభం అవుతుంది.ప్రారంభ వేడుకల్లో భాగంగా జరిగే ఆయాదేశాల పరేడ్‌లో భారత్ నుంచి ఒలింపిక్ పతక విజేతలు అయిన లవ్లీనా బార్గోయిన్,మీరాబాయ్ చాను త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ప్రదర్శిస్తారు.వీరిద్దరినీ బాటన్ బేరర్స్‌గా భారత్ నియమించింది. 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌ ఓపెనింగ్ సెరెమొనీలో భాగంగా స్టాట్లాండ్ దేశానికి చెందిన సింగ్ లిరిసిస్ట్ కెటి.టన్స్‌టాల్, ఫోక్ మ్యుజీషియన్ నాథన్ ఈవన్స్, స్కాటిష్ మ్యూజిక్ బృందం సెయింట్ ఫింక్స్‌లు తమ ప్రదర్శన ఇస్తారు.

కామన్‌వెల్త్ గేమ్స్‌ 2026 ప్రత్యేక అతిథులు

ప్రపంచం అబ్బురుపోయేలా నిర్వహించే ఈ గ్రాండ్ స్పోర్టింగ్ ఈవంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. కింగ్ చార్లెస్ -III, క్వీన్ కామిల్లాలు హాజరవుతారు. అంతేకాదు కింగ్ చార్లెస్ కామన్‌వెల్త్ గేమ్స్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు.

కామన్‌వెల్త్ గేమ్స్ స్ట్రీమింగ్ ఎక్కడ..?

2026 కామన్‌వెల్త్‌ గేమ్స్ భారతీయులు సోనీ స్పోర్ట్స్ టెన్ 2,సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హిందీ,సోనీ స్పోర్ట్స్ టెన్ 4లో వీక్షించొచ్చు. ఈ ఛానెల్స్‌లో లైవ్ చూడొచ్చు. అదే సమయంలో సోనీ లివ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా గేమ్స్ చూడొచ్చు. ఇక ఈ కామన్‌వెల్త్ గేమ్స్‌‌లో అథ్లెటిక్స్, స్విమ్మింగ్,సైక్లింగ్, జిమ్నాస్టిక్స్,బాక్సింగ్‌తో పాటు ఇతరత్రా క్రీడలున్నాయి.ముగింపు సెరెమొనీతో ఈ క్రీడలు అధికారికంగా ముగుస్తాయి. ఆ సమయంలో 2030 కామన్‌వెల్త్ గేమ్స్ భారత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతాయని చెప్పేందుకు అధికారికంగా కామన్‌వెల్త్ గేమ్స్ జెండాను భారత్‌కు అప్పజెప్తారు.2030లో జరిగే అహ్మదాబాద్ కామన్‌వెల్త్ గేమ్స్ 100వ కామన్‌వెల్త్ గేమ్స్ కావడంతో మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+