వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేడారం దేవతలను దర్శించుకోనున్న కె చంద్రశేఖర రావు

ఈ సందర్భంగా పార్టీకి చెందిన జిల్లా ముఖ్యనాయకులతో చర్చిస్తారని తెలిసింది. తెలంగాణపై ఈనెల 28వ తేదీ వరకు రాజకీయ జేఏసీ డెడ్‌లైన్ ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ జిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఉద్యమ ఇన్‌చార్జ్‌లతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఉద్యమంపై పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయడంతో పాటు తీసుకోవాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. 22వ తేదీ ఉదయం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.