హైదరాబాద్: దమ్ములుంటే తెలంగాణలో తనపై పోటీ చేసి గెలవాలని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని సవాల్ చేశారు. తనపై పోటీ చేసి చిరంజీవి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఒక వేళ తాను గెలిస్తే సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటానని చిరంజీవి ప్రకటన చేయాలని మహేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.
సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటానని ప్రకటించిన చిరంజీవి మాట మార్చడంపై తెలంగాణకు చెందిన మహేశ్వర రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటానని చిరంజీవీ ప్రకటించి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ విషయంపై మహేశ్వర రెడ్డి కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి కూడా చిరంజీవిపై ఫిర్యాదు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి