హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థులు తలపెట్టిన మహా పాదయాత్ర మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. తెలంగాణ విద్యార్థుల మహా పాదయాత్ర సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ర్స్ కళాశాల వద్ద కోలాహలం నెలకొంది.కవులు, కళాకారుల ఆటపాటలతో, సంఘీభావ ర్యాలీలతో సందడి చోటు చేసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహా రెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.
హైదరాబాదులోని ఆర్ట్ర్స్ కళాశాల నుంచి రెండు మహా పాదయాత్ర బృందాలు బయలుదేరాయి. ఒక బృందం దక్షిణ తెలంగాణ అంతటా తిరుగుతూ ఫిబ్రవరి 7వ తేదీకి వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం చేరుకుంటుంది. రెండో బృందం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో తిరుగుతూ అదే రోజు కాకతీయ విశ్వవిద్యాలయం చేరుకుంటుంది. ఫిబ్రవరి 7వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయంలో మహా ప్రదర్శన జరుగుతుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి