సర్కారు ఎట్లా నడుస్తుందో చూస్తాం: కె చంద్రశేఖర రావు

ఎంసీఎ విద్యార్థి వేణుగోపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించటానికి కెసిఆర్ మంగళవారం సాయంత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చారు. భౌతికకాయం వద్ద, అనంతరం ఠాకూర్ ఆడిటోరియం భవనం బయటా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్థుల ఆత్మహత్యలతో మానసికంగా కుంగిపోతున్నామన్నారు. ఆత్మహత్యలు మంచిది కాదని..ఆత్మలు క్షోభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తామిక్కడకు రావటానికి ముందు రాజకీయ ఉమ్మడి కార్యాచరణ మండలి (జేఏసీ) సమావేశం జరిపామన్నారు.
వారిప్పుడు విద్యార్థి జేఏసీతో కలిసి చర్చలు జరుపుతారన్నారు. రాజకీయ జేఎసీలో తీసుకున్న నిర్ణయాలను కెసిఆర్ వివరిస్తూ..'ఇక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయలుదేరి స్పీకర్ వద్దకెళుతున్నారు. రాజీనామాలు ఆమోదించాలని ఒత్తిడి తెస్తారు. అవసరమైతే స్పీకర్ దగ్గర బైఠాయించి అయినా రాజీనామాలు ఆమోదించే వరకూ ఊరుకోం. మిగిలిన వారు రేపు బంద్ కాబట్టి, ఎల్లుండి నగరానికి చేరుకొని రాజీనామాల్ని ఆమోదింపజేసుకోవాలి' అన్నారు. శవాన్ని పోస్ట్ మార్టం చేసేందుకు విద్యార్థులు సహకరించాలని కోరారు. అది పూర్తయ్యాక భౌతికకాయాన్ని ఐసుపెట్టెలో పెట్టి ఆర్ట్ కళాశాల వద్ద ఉంచుతున్నట్లు తెలిపారు. 'అందరి రాజీనామాలు ఆమోదించే వరకూ శవాన్ని అక్కడ నుంచి కదల్చం' అని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications