హైదరాబాద్: "జిల్లాల్లో ప్రభుత్వాలు మీవే, అవినీతిని నిర్మూలించి, పథకాలను పక్కాగా అమలు చేయండి" అని ముఖ్యమంత్రి రోశయ్య కలెక్టర్లకు హితవు చెప్పారు. సమస్యలు లేని జీవితం లేదు, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి జరగాలని ఆయన ఉద్భోదించారు. జూబ్లీహాలులో ఏర్పాటుచేసిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. పారదర్శకం కలిగిన ప్రభుత్వం అన్న భావన ప్రజల్లో కలిగేలా చూడాలని కోరారు. రేషన్ కార్డుల పరిశీలన నెలాఖరులోగా పూర్తయితే మార్చిలోగా అర్హులకు కొత్తకార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీపై అధికారులు ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం కోరారు. కలెక్టర్లు వసతిగృహాల్లో బసచేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అవినీతి ఆరోపణలను ప్రభుత్వం సహించదన్న అభిప్రాయం అందరిలో కలగాలని సీఎం అభిప్రాయపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి