వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్ధులు

తెలంగాణపై గట్టిగా మాట్లాడలేదంటూ మంత్రి పొన్నాలపై తెలంగాణ వాదులు చాలా రోజులుగా ఆగ్రహంగా ఉన్నారు. మొన్న మంత్రి కన్పించడం లేదంటూ కొందరు యువకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వార్తలకెక్కారు. మేడారం జాతర పనులను సమీక్షించడానికి ఇటీవల మంత్రి లక్ష్మయ్య వెళ్తున్నప్పుడు ములుగు, తదితర చోట్ల జెఎసి నాయకులు నిలిపివేశారు. లక్ష్మయ్య చేత బలవంతంగా "జై తెలంగాణా అనే నినాదాలు చేయించారు. తిరుగుప్రయాణం ప్రభుత్వ బుగ్గ కారులో సురక్షితం కాదని గ్రహించిన పోలీసులు మంత్రిని, మరికొందరు ప్రజాప్రతినిధులను ఆర్టీసీ బస్సులో వరంగల్ పంపవలసి వచ్చింది.