హింస ద్వారా తెలంగాణ సాధించుకోలేరు: ఏఐసిసి

హింసతో ఏదీ సాధించలేమన్న నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి సింఘ్వీ హితవు పలికారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యంత సమర్ధవంతమైనదని అలాంటి రాష్ట్రాన్ని ఆందోళనలు, హింసాత్మక చర్యలతో నిర్వీర్యం చేయవద్దని ఆయన కోరారు. విద్యార్థులు, పార్టీలు నిబద్ధతతో ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తెలంగాణపై కేంద్రానికి నిబద్ధత లేదంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. వ్యక్తిగత ఇష్టాలకు కాంగ్రెస్ పార్టీలో తావులేదన్నారు. తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం కృషి చేస్తున్నదని సింఘ్వి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications