అంతర్వేది ఉత్సవాలు-నేటి నుంచి 31 వరకు

కల్యాణ మహోత్సవాల్లో స్వామివారికి వివిధ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ప్రధానార్చకుడు వాడపల్లి బుచ్చిబాబు తెలిపారు. ఇప్పటికే ఆల యంలో పదిలంగా ఉంచిన సప్తనదుల జలాలతో శుక్రవారం స్వామి వారికి నిర్వహించే అభిషేకం ఎంతో పవిత్రమైనదన్నారు. చరిత్రలోనే మొదటిసారిగా ఆలయంలో జరుగుతున్న ఈ అభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉందని,విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాఘమాసం లో సూర్యుడి పుట్టిన రోజైన రథసప్త మి, లక్ష్మీప్రదమైన శుక్ర వారం నిర్వహిస్తున్న ఈ అభిషేకంతో స్వామివారికి మరింత దివ్యతేజస్సు చేకూరుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications