హైదరాబాద్: బంద్ లు, ధర్నాలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు లేదని హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు బంద్ లు, ధర్నాలు నిర్వహించడంపై దాఖలై పిటిషన్ పై హైకోర్టు ఆ విధంగా ప్రతిస్పందించింది. రాజకీయ పార్టీలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని వ్యాఖ్యానించింది. అవసరమైతే అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించాలని హైకోర్టు సూచించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడి చేస్తే నష్టపరిహారం దాడులు చేసినవారి నుంచే వసూలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మీడియా నిర్లక్ష్యంగా వార్తలను ప్రసారం చేయరాదని కూడా సూచించింది. తమపై సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మీడియా విస్మరించకూడదని అభిప్రాయపడింది. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి