తెలంగాణపై కోర్ కమిటీ సమావేశం

Manmohan Singh
న్యూఢిల్లీ: కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. తెలంగాణపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాని మన్మోహన్ నివాసంలో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణపై పూర్తి స్థాయిలో చర్చించి ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతోనూ సమావేశమయ్యారు.

తెలంగాణ పార్లమెంటు సభ్యులు శుక్రవారం డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. తెలంగాణపై ఒక కమిటీని వేసే అవకాశం ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చెప్పారు. ఈ కమిటీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా అంగీకరిస్తారని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు. ఆయన పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మరోసారి ఈ నెల 26వ తేదీన ఢిల్లీ వస్తున్నారు. తెలంగాణపై కేంద్రం నుంచి ఈ నెల 28వ తేదీలోగా ఒక ప్రకటన వెలువడుతుందని యాష్కీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+