హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమారుడు, శాసనసభ్యుడు కెటి రామారావు దాడులకు రెచ్చగొడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు విమర్శించారు. చిరంజీవిపై కెటి రామారావు చేసిన విమర్శలపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. చిరంజీవిపై దాడి చేయాలని రెచ్చగొడుతున్న కెటిఆర్ కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
కెటి రామారావు తండ్రి కెసిఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన విమర్శించారు. దీనిపై కెటిఆర్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి పార్టీకి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర నినాదం తీసుకున్న చిరంజీవిని ఆ పార్టీ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. చిరంజీవిపై తీవ్ర విమర్సలు కూడా చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి