వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేం తెలంగాణ జెఎసిలో ఉన్నాం: ఆర్ దామోదర్ రెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి శవయాత్ర సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన అత్యంత కీలకమైందని, ఆ ప్రకటన నుంచి ప్రభుత్వం వెనక్కి పోతే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో జీవించాలని భావిస్తున్నారని ఆయన అన్నారు.