వైయస్ మృతి: నెపం హెలికాప్టర్ మీదికి

YSR Chopper
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ పనికి మాలిందని, దాని నిర్వహణ ఏ మాత్రం పనికి వచ్చేలా లేదని దర్యాప్తు నివేదిక తెలియజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బెల్ 430 (బిటి - ఎపిజిః హెలికాప్టర్ నిరుడు సెప్టెంబర్ 2వ తేదీన నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద కూలిపోయి వైయస్ రాజశేఖర రెడ్డి సహా నలుగురు మరణించిన విషయం తెలిసిందే. వైయస్ ప్రయాణించిన హెలికాప్టర్ నిర్వహణ సరిగా లేదని, అది ప్రయాణానికి పనికి వచ్చేది కాదని నివేదికలు తెలియజేస్తున్నాయి.

విఐపి హెలికాప్టర్ నిర్వహణ పట్ల సిబ్బంది అతి సాధారణ పద్ధతిలో వ్యవహరించారని తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన సంస్థ హెలికాప్టర్ నిర్వహణపై శ్రద్ధ చూపలేదని నివేదిక వ్యాఖ్యానించింది. హెలికాప్టర్ సాంకేతిక వివరాలను సరిగా అందించలేదని కూడా ఆరోపించింది. హెలికాప్టర్ ఇంజిన్ ను 2007 నవంబర్ 1వ తేదీన తొలగించి, 2009 మే 30వ తేదీన తిరిగి అమర్చారని, అందుకు కారణమేమిటో తెలపలేదని వివరించింది.

హెలికాప్టర్ సిబ్బంది వాతావరణం సరిగా లేకపోవడాన్ని పట్టించుకోలేదని, ఈ స్థితిలోనూ ప్రయాణానికి అంగీకరించారని విమర్శించింది. అత్యవసర స్థితిలో అనుసరించాల్సిన పద్ధతిని కూడా పట్టించుకోలేదని తప్పు పట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+