న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ నటిగా హిందీ తార ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. ప్రభుత్వం శనివారంనాడు జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడిగా మరాఠీ చిత్రం జోగువాలో ప్రదర్సించిన నటనకు గాను ఉపేంద్రకు లభించింది. బెంగాలీ చిత్రం అంతహీన్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఫ్యాషన్ సినిమాలో నటించిన కంగనా రనౌత్ కు ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది.
ఉత్తమ గాయకుడిగా హరిహరన్, ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషల్ ఎంపికయ్యారు. శ్రేయా ఘోషల్ కు ఈ అవార్డు రావడం ఇది రెండో సారి. ఉత్తమ సహాయ నటుడి అవార్డు రాక్ ఆన్ హిందీ చిత్రంలో నటనకు గాను అర్జున్ రాంపాల్ కు దక్కింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన హిందీ చిత్రంగా ఒయ్ లక్కీ...లక్కీ ఓయ్ ఎంపికైంది. తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1940లో ఒక గ్రామం ఎంపికైంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి