ఖమ్మం: ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం అన్నాజీగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు ఖమ్మం జాతీయ రహదారిపై ఢీకొన్నాయి. దీంతో కారులోని సిలిండర్ పేలింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.