వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లతా మంగేష్కర్ కు అక్కినేని అవార్డు

హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో లతా మంగేష్కర్ కు అవార్డు ప్రదానం జరుగుతుంది. లతా మంగేష్కర్ ఈ నెల 31వ తేదీన హైదరాబాదు చేరుకుంటారు. 85 ఏళ్లు నిండిన ఆమెకు అదే రోజు హైదరాబాదులో సన్మానం జరుగుతుంది. మర్నాడు ఆమెకు అక్కినేని నాగేశ్వర రావు అంతర్జాతీయ అవార్డు ప్రదానం జరుగుతుంది. లతా మంగేష్కర్ హిందీలోనే కాకుండా పలు భాషా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడారు. ఒక తెలుగు చిత్రంలో కూడా ఆమె పాట పాడారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేర నెలకొల్పిన ఈ అవార్డును గతంలో సినీ ప్రముఖులు అందుకున్నారు.