వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సముద్రంలో కూలిన ఇథియోపియా విమానం

ప్రయాణికుల్లో 50 మంది లెబనాన్ కు చెందినవారని, మిగతావారిలో చాలా మంది ఇథియోపియాకు చెందినవారని సమాచారం. విమానంలో ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు. బీరుట్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఇథియోపియా రాజధాని అడ్డీస్ అబాబాకు వెళ్లాల్సి ఉందని చెబుతున్నారు. విమానం కూలిపోతుండగా సముద్ర తీరంలో ఉన్నవారు చూసినట్లు చెబుతున్నారు. దీనిపై మాట్లాడడానికి సంస్థ అధికారులు అందుబాటులో లేరు.