కరీంనగర్: తెలంగాణ ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ జిల్లాలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆమె నిప్పంటించుకుంది. అరవై శాతం శరీరం కాలిన ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు శోకసాగరంలో మునిగిపోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కోరుతూ విద్యార్థిని సునీత సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టింది. ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాజకీయ నాయకులు ఎంతగా చెప్పినా ఫలితం ఉండడం లేదు. ప్రతి రోజూ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీతను పలువురు నాయకులు పరామర్శిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి